

‘పోలీస్ కంప్లైంట్’ సినిమా విడుదలకు ముందు దర్శకుడు సంజీవ్ మేగోటి, నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. చిత్ర ప్రమోషన్స్‌కు వరలక్ష్మి సహకరించలేదని, డబ్బింగ్ ప్రక్రియలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని దర్శకుడు ఆరోపించారు. కీలక పాత్ర పోషించిన నటి నుంచి తగిన మద్దతు లభించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఆరోపణలపై స్పందించిన వరలక్ష్మి, తనను అధికారికంగా ఆహ్వానించిన ప్రతి కార్యక్రమానికి హాజరయ్యానని, తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు తెలియకుండా స్పందించడం సరైంది కాదని పేర్కొన్న ఆమె, వివాదాన్ని మరింత పెద్దదిగా చేయాలనుకోవడం లేదన్నారు. అయితే “కొన్ని కుక్కలు అరుస్తాయి కానీ కరవవు.. నేను అరవను, కరుస్తా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ కావడంతో, అది దర్శకుడికి ఇచ్చిన పరోక్ష కౌంటర్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రంపై ఈ వివాదం మరింత ఆసక్తిని పెంచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!