

అగ్ర కథానాయకుడు నాగార్జున నటిస్తున్న వందో చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రా. కార్తీక్ మాట్లాడుతూ నాగార్జున ఈ సినిమాలో పలు రకాల గెటప్పుల్లో కనిపించనున్నారని వెల్లడించారు. ఆయన పేరు వినగానే ‘శివ’, ‘రక్షకుడు’తో పాటు ‘కూలీ’ సినిమాలోని సైమన్ లాంటి స్టైలిష్ పాత్రలు గుర్తుకు వస్తాయని, ఆ తరహా వైవిధ్యాన్ని గుర్తు చేసేలా ఈ చిత్రం ఉండబోతుందని తెలిపారు.
డబ్బు, లాటరీ వంటి అంశాలతో ముడిపడిన కథతో ఈ సినిమాను యాక్షన్ ప్రధానంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కొత్త కథలు, కొత్త దర్శకులను నమ్మి సినిమాలు చేయడంలో ముందుండే నాగార్జున తన ప్రతిష్ఠాత్మకమైన వందో చిత్రాన్నీ యువ దర్శకుడు రా. కార్తీక్‌తో రూపొందించడం విశేషంగా మారింది. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ‘కింగ్ 100’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!