

ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "డ్రాగన్"పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ తర్వాత చిత్ర కథా నేపథ్యంపై దర్శకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రం ముంబై, కోల్కతా నగరాల నేపథ్యంలో సాగుతుందని, తన చిన్ననాటి అనుభవాలే కథకు భావోద్వేగ బలంగా నిలిచాయని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఇప్పటివరకు తాను చెప్పిన కథల్లో ఇదే అత్యంత వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ అని ఆయన పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలన కాలంలో ప్రారంభమైన నల్లమందు (ఒపియం) అక్రమ వ్యాపారం, దాని చుట్టూ కొనసాగిన నేర ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని కథను రూపొందించినట్లు దర్శకుడు వెల్లడించారు. యాక్షన్, భారీ విజువల్స్ మాత్రమే కాకుండా బలమైన భావోద్వేగాలు, మానవ సంబంధాలు, ఘర్షణలే చిత్రానికి ప్రధాన బలమని చెప్పారు. చారిత్రక వాస్తవాలను ఆధారంగా చేసుకుని ఒక శక్తివంతమైన సినీ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!