
బిజినెస్

తిరుపతిలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన “జననాయకన్” సినిమా విడుదల సందర్భంగా అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు. విడుదలకు ముందు ఎదురైన అడ్డంకులు, ఉత్కంఠకు తెరపడడంతో నేడు చిత్రం థియేటర్లలో విడుదలైంది. దీంతో నగరంలోని పలు థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.
విజయ్ భారీ కటౌట్లకు పాలాభిషేకం చేసి, టపాసులు పేల్చుతూ, నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. సినిమా విడుదలతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొని సందడి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!