
.png&w=3840&q=75)
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున కాల్పులు జరగడంతో భయం కలిగింది. ఐదుగురు నిందితులు అమన్ ఆనంద్ మరోట్, స్వప్నిల్ బంధు సాకేత్, సిద్ధార్థ్ దీపక్ ఐన్పురే, సమర్థ్ శివ్ శరణ్ పోమాజీ, ఆదిత్య జ్ఞానేశ్వర్గా గుర్తించబడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రాత్రి కోర్టులో హాజరుపరిచిన అధికారులు ఈ నెల 5 వరకు పోలీసులు కస్టడీకి మంజూరు చేశారు. ప్రాథమిక విచారణలో, నిందితులు రోహిత్ శెట్టిని భయపెట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తేలింది.
తదుపరి విచారణలో, ఈ కుట్రను మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అమలు చేసినట్టు గుర్తించబడింది. గ్యాంగ్ సభ్యులు శుభం లంగ్కోర్, అర్జు బిష్ణోయ్, హరి బాక్సర్లు తమ భాగస్వామ్యాన్ని ఫేస్బుక్లో స్వయంగా వెల్లడించారు. వారు రోహిత్ శెట్టికి ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చినా, అతడు పట్టించుకోలేదని చెప్పి, ఈ కాల్పులు కేవలం “ట్రైలర్” మాత్రమే అని హెచ్చరించారు. ముఖ్య షూటర్ అమన్ ఆనంద్ మరోట్ నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!