
జనరల్

టాలీవుడ్ నటుడు విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్ చిత్రం వచ్చే నెల 3న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం వరుసగా ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా “వీరనాగ” పాట విడుదల తేదీని ఈ నెల 25గా అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో “వీరనాగ” పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించగా, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అభిషేక్ నామ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!