

“మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి అద్భుత సినీ ప్రస్థానాన్ని ప్రతిబింబిస్తూ ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త కె.వి. రావు ప్రతిష్టాత్మక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి మెగాస్టార్‌ను సన్మానించారు. ఈ వేడుకకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ హాజరై చిరంజీవితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే నేటి తరం విజయవంతమైన దర్శకులు అనిల్ రావిపూడి, బాబీ కూడా పాల్గొని చిరంజీవి సాధించిన విజయాలను కొనియాడారు.

కేవలం ఒక సినిమా విజయానికే పరిమితం కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న చిరంజీవి వారసత్వాన్ని ఈ సందర్భంగా ఘనంగా జరుపుకున్నారు. తన కృషి, క్రమశిక్షణతో సాధించిన ఈ శిఖరాగ్ర స్థానం భవిష్యత్ తరాల నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన ప్రస్థానం భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని సినీ ప్రముఖులు పేర్కొన్నారు.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!