

న్యూ ఇయర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “సఃకుటుంబానాం”. హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్‌పై ఉదయ్ శర్మ రచన, దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి మధు దాసరి సినిమాటోగ్రఫీ అందించగా, శశాంక్ మలి ఎడిటింగ్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన “సఃకుటుంబానాం” చిత్రం ఇప్పుడు 2026 జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నూతన సంవత్సరం సందర్భంగా అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!