

దక్షిణాది సినీ పరిశ్రమలో సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ప్రత్యేకతను లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ద్వారా సృష్టించారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఆయన దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఆయన మేకప్ వేసుకుని, హీరోగా వెండితెరపై విశ్వరూపం చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది లోకేష్ కథానాయకుడిగా పరిచయం కానున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డీసీ’ (Devadas + Chandra) గా వినిపిస్తోంది.
ఈ రోజు (ఫిబ్రవరి 14) ప్రేమికుల రోజు సందర్భంగా, చిత్ర యూనిట్ ‘బ్లడీ వాలెంటైన్’ పేరుతో సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసింది. సాధారణంగా వాలెంటైన్ డేకి ప్రేమ, రొమాన్స్ నిండిన వీడియోలు వస్తాయి. కానీ లోకేష్ సినిమాకు వయొలెన్స్ అనివార్యం! ఈ గ్లింప్స్‌లో రక్తపాతం, శత్రువుల పీకలు కోస్తున్న లోకేష్ కిరాతకమైన లుక్‌లో కనిపించారు. చివర్లో కారుపై చిందిన రక్తం చూసే సరికి, సినిమా వయొలెన్స్ రేంజ్ ఎంత ఉంటుందో తక్షణమే అర్థమవుతోంది.
చిత్రానికి ‘డీసీ’ అనే టైటిల్ పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. లోకేష్ దేవదాస్‌గా, బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి చంద్రగా నటిస్తున్నారు. వారి పేర్ల మొదటి అక్షరాలను కలిపి ‘DC’ అని టైటిల్ నిర్ణయించారు. శరత్ చంద్ర రాసిన ‘దేవదాస్’ నవలకు ఇది ఒక మోడర్న్, వయొలెంట్స్ వెర్షన్ అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తూ, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. లోకేష్ తన హీరోగా పరిచయం ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!