

డైరెక్టర్స్ డే వేడుకల్లో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకరత్న దాసరి నారాయణరావును స్మరించుకుంటూ రూపొందించిన ప్రత్యేక ఏఐ వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నటుడు, దర్శకుడు యనమదల కాశీ విశ్వనాథ్ రూపొందించిన ఈ ఏవీ, ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి రూపొందించబడింది. దాదాపు నెల రోజుల పాటు ఎడిటర్ మెహర్ వెంకటేష్‌తో కలిసి ఆయన ఈ ప్రాజెక్ట్‌పై కృషి చేశారు. ఈ వీడియో ప్రదర్శన సమయంలో అక్కడున్న దర్శకులు, సినీ ప్రముఖులు భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ ఏఐ వీడియోకు ఆర్సీఎం రాజు అందించిన గంభీరమైన వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. సాంకేతికతను కేవలం వినోదం కోసం కాకుండా మహానుభావులకు నివాళి అర్పించడానికి ఉపయోగించవచ్చని ఈ ప్రయత్నం నిరూపించింది. పరిశ్రమలో పలువురు ప్రముఖులు కాశీ విశ్వనాథ్‌ను అభినందించారు. సాంకేతికతకు భావోద్వేగాన్ని జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఈ ప్రాజెక్ట్ స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!