

భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ‘ఫస్ట్ టైం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” పాట విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. హేమంత్ ఇప్పలపల్లి ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, నిర్మాణం, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కృత్రిమ మేధస్సును ఉపయోగించకుండా పూర్తిగా మానవ మేధస్సుతో అత్యాధునిక గ్రాఫిక్స్ రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రంలో సౌరబ్ ధింగ్ర హీరోగా నటిస్తుండగా, అఖిల్ సార్థక్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ్, దువ్వాడ శ్రీనివాస్, పాయల్ రాజ్‌పుత్ తదితరులు హాజరై చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా కోసం హేమంత్ ఎంతో కష్టపడ్డారని, విడుదల తర్వాత ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ గురించి పెద్ద స్థాయిలో చర్చ జరుగుతుందని పాయల్ రాజ్‌పుత్ పేర్కొన్నారు. కొత్త కాన్సెప్ట్, భావోద్వేగాలు, భారీ విజువల్ గ్రాండియర్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!