

వారణాసి లాంచ్ ఈవెంట్‌లో హనుమంతుడి గురించి నాస్తిక వ్యాఖ్యలు చేసినందుకు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై వివాదం చెలరేగింది. “తాను హనుమంతుడిని నమ్మను” అని చెప్పిన రాజమౌళి వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. తాజాగా రాష్ట్రీయ వానరసేన, రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు హిందూ భావాలను దెబ్బతీశాయని వానరసేన సభ్యులు ఆరోపించారు. హనుమంతుడు గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని, వెంటనే రాజమౌళిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభావవంతమైన వ్యక్తులు ఇలా మాట్లాడటం తేలికగా తీసుకోలేని విషయం అని వారు పేర్కొన్నారు.
హిందూ దేవుళ్లను అవమానించే ధోరణి పరిశ్రమలో పెరుగుతోందని వానరసేన ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసుపై సరూర్‌నగర్ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. మరిన్ని వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!