

బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాక్టెయిల్ 2 చిత్రం భారీ అంచనాల మధ్య ముందుకు వస్తోంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బృందం తాజాగా ముంబయిలో సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ కృతి సనన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె చాలా హాట్‌గా ఉంటుందని, ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ చిత్రం చాలా భిన్నంగా ఉండబోతోందని, ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఉంటుందని తెలిపారు.
అలాగే షాహిద్ కపూర్‌తో తన కెమిస్ట్రీ మరో స్థాయిలో ఉంటుందని, ఈ విభిన్న ప్రేమకథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని రష్మిక చెప్పారు. త్వరలో మరిన్ని ఆసక్తికర సమాచారం రానున్నాయని వెల్లడించారు. ఇక కృతి, రష్మిక పాత్రలపై స్వలింగ ప్రేమకథగా, త్రిభుజ ప్రేమకథగా సినిమా ఉండబోతోందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2012లో వచ్చిన కాక్టెయిల్ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతోంది. దీపికా పదుకొణె, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ నటించిన ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం వచ్చే నెల 19 న విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!