

వరంగల్ మామునూర్‌లో నిర్మించనున్న విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలనే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి సూచనలు కోరిన విషయం తెలిసిందే. విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తయి, ఆ స్థలాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విమానాశ్రయం వరంగల్ ప్రాంతంలో పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులకు మరింత ఊతమిచ్చే కీలక మౌలిక వసతిగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుపై సీపీఐ నేత నారాయణ స్పందిస్తూ.. వరంగల్ విమానాశ్రయానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని సూచించినట్లు సమాచారం. వరంగల్ ప్రాంతంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించిన పీవీ నరసింహారావు 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇదే క్రమంలో రాణి రుద్రమ, కాకతీయ, సమ్మక్క-సారక్క వంటి పేర్లను కూడా పలువురు సూచించారు. అయితే విమానాశ్రయానికి తుది పేరు ఇంకా ఖరారు కాలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!