

సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా “ఛాంపియన్” ఇటీవల టీజర్ విడుదలైంది. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కథ స్వాతంత్ర్యం పొందకముందు హైదరాబాదీ ఫుట్‌బాలర్ మైఖేల్ సీ. విలియమ్స్ జీవితం ఆధారంగా సాగుతుంది. దేశం కోసం ఆడి, ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్ ను కలిసే అవకాశం పొందే అతని జీవితంలోని కష్టాలు, సవాళ్లు కథలో ప్రధాన భాగం.
ఫుట్‌బాలర్‌గా రోషన్ కొత్త లుక్, హైదరాబాదీ యాసలోని హిందీ మిక్స్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ అనస్వర రాజన్ తో అతని ప్రేమకథ కూడా బలంగా అనిపిస్తోంది. దర్శకుడు ప్రదీప్ స్పోర్ట్స్, యాక్షన్, రొమాన్స్, వార్ వంటి విభిన్న అంశాలను సమతుల్యంగా మిళితం చేశారు. ప్రీ-ఇండిపెండెన్స్ సెటప్ నేచురల్‌గా, నిజమైన విజువల్స్‌తో చూపించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సినిమాకు చక్కని ఫీల్ ఇచ్చింది.
మొత్తానికి టీజర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. “ఛాంపియన్” డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!