
.jpg&w=3840&q=75)
బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు.
1935 డిసెంబర్ 8 న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, తన కరుణ, శక్తివంతమైన నటన, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో బాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.
‘హీమ్యాన్ ఆఫ్ బాలీవుడ్’గా పేరుపొందిన ఆయన, షోలే చిత్రంలో చూపించిన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత ముద్ర వేశారు.
1960 లో విడుదలైన దిల్బీ తేరా హమ్బీ తేరే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ధర్మేంద్ర, తన కెరీర్లో 300 కుపైగా సినిమాల్లో నటించి విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.
అతని పూర్తి పేరు ధరమ్‌సింగ్ డియోల్. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. 2004 లో రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 1997 లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2012 లో దేశం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం అందించింది.
ధర్మేంద్ర మరణంతో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!