

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చరిత్రలో ఒక విశేషమైన ఘట్టం చోటుచేసుకుంది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్ మైదానంలో జరుగుతున్న ఈ శతాబ్ది వేడుకల్లో సల్మాన్ ఖాన్ తన కారులో వచ్చి పాల్గొన్నారు. మోహన్ భగవత్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ ఆయన కార్యక్రమాన్ని పరిశీలించారు.
ముస్లిం మతానికి చెందిన సల్మాన్ ఖాన్ హిందూ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!