
సినిమాలు

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్’ బాక్సాఫీస్ వద్ద సైలెంట్‌గా మంచి విజయాన్ని నమోదు చేస్తోంది. సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అభిరామి కీలక పాత్రలు పోషించారు. మే 28న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటూ మంచి వసూళ్లు రాబడుతోంది.
తాజాగా ఈ చిత్రం బుక్‌మైషోలో 10 లక్షలకుపైగా టికెట్ బుకింగ్స్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. పెద్దగా ప్రచారం లేకుండానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!