

‘అఖండ 2: తాండవం’ చిత్రంలో లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించడం నా అదృష్టమని హర్షాలి మల్హోత్రా అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ‘జనని’ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖండ ఆశీర్వాదాలతో కూడిన ఈ పాత్ర కథలో ముఖ్యమైన మలుపును తెస్తుందన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సంగీతం సినిమాపై భారీ అంచనాలు పెంచాయని తెలిపారు. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025 న 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
షూటింగ్ సందర్భంగా తీవ్రమైన చలిలో, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద కూడా సన్నివేశాలు చేశానని హర్షాలి తెలిపారు. బాలకృష్ణ గారి ఎనర్జీ, ప్రోత్సాహం తనకు ఎంతో ధైర్యాన్నిచ్చాయని పేర్కొన్నారు. బోయపాటి గారు ప్రతి సీన్లో ధైర్యం చెప్పి ప్రోత్సహించారన్నారు. తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!