

నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా వరుసగా అవార్డులు అందుకుంటూ మంచి గుర్తింపు పొందుతోంది. ఇటీవల ఈ సినిమాకు ఉత్తమ నటిగా రష్మికకు గద్దర్ అవార్డులులో అవార్డు లభించింది. తాజాగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలులో కూడా ఈ సినిమా మూడు అవార్డులు సాధించింది.
చెన్నైలో జరిగిన 28 వ ఉగాది పురస్కారాల కార్యక్రమంలో రష్మిక మందన్నకు ఉత్తమ నటి అవార్డు లభించింది. నటుడు దీక్షిత్ శెట్టి ఉత్తమ విలన్‌గా అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ రచన మరియు దర్శకత్వం విభాగంలో బాపు–రమణ అవార్డును దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన దీక్షిత్ శెట్టి మరియు రాహుల్ రవీంద్రన్ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ మరియు ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, నిర్మాతలుగా ధీరజ్ మొగిలినేని మరియు విద్య కొప్పినీడి వ్యవహరించారు. వరుస అవార్డులతో ఈ సినిమా సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
.jpeg)




.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!