
గాసిప్స్

డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు కొట్టివేయగా, ఇప్పుడు సినిమా పైరసీ రూపంలో బయటకు వచ్చింది. ‘రాజా సాబ్’ మూవీకి సంబంధించిన HD ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది.
కొందరు కేటుగాళ్లు సినిమాను పైరసీ చేసి ఒక ఆన్‌లైన్ సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, ఫ్యాన్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!