

నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా పోస్ట్‌తో మరోసారి ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. సమాజంపై సినిమాల ప్రభావం, క్రియేటివ్ ఫ్రీడమ్ అంశాలపై ఆమె రాసిన సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఆమె ఎటువంటి సినిమా పేరు చెప్పకపోయినా, పరోక్షంగా ఒక సినిమాపై స్పందనగా ఈ పోస్ట్ భావించబడుతోంది.
సినిమాలు సమాజాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయని చెప్పడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా అనేది కల్పిత కథ మాత్రమేనని, ఏది మంచి, ఏది చెడు అన్నది ప్రేక్షకుల విచక్షణపై ఆధారపడి ఉండాలని అన్నారు. సినిమాల ద్వారా పిల్లలకు విలువలు నేర్పాలని భావించడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. పాత సినిమాల్లో హీరో, విలన్ మధ్య స్పష్టమైన తేడా ఉండేదని, కానీ ఇప్పుడు పాత్రలు మరింత క్లిష్టంగా మారాయని వివరించారు.
క్రియేటివ్ ఫ్రీడమ్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా సమానంగా ఉండాలని అనసూయ పేర్కొన్నారు. తన అభిప్రాయాల కారణంగా గతంలో ఒక ప్రముఖ షో నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కూడా ఆమె వెల్లడించారు. తన ఉద్దేశం సెన్సార్ చేయడం కాదని, సమాజంలో అవగాహన పెంచడమేనని ఆమె స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!