

మా ఇంటి బంగారం సినిమా పోస్టర్‌ను ఈ రోజు చిత్రబృందం విడుదల చేసింది, అది సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటోంది. ఇదే సందర్భంగా సినిమా టీజర్ ట్రైలర్ విడుదలపై కూడా అధికారిక ప్రకటన వెలువడింది. “మీరు చూస్తా ఉండండి… మీ అందరితో కలిసిపోతుంది” అనే భావోద్వేగ సందేశంతో వచ్చిన ఈ అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నెల 9 ఉదయం 10 గంటలకు టీజర్ ట్రైలర్ విడుదల కానున్నట్లు వెల్లడించడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
ఈ చిత్రానికి బి.వి. నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, త్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. అలాగే రాజ్ నిడిమోరు కూడా చిత్ర నిర్మాణంలో భాగంగా ఉన్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌తో పాటు టీజర్ ట్రైలర్ అప్డేట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. టీజర్ విడుదలతో ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి ముద్ర వేయబోతుందో చూడాల్సి ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!