
జనరల్

వాతావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు నటి సోనాక్షి సిన్హా బహిరంగ మద్దతు తెలిపారు. దీక్ష 18వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఇక మౌనం పాటించలేనని ఆమె వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ ఉద్యమం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, భవిష్యత్ తరాల భద్రత కోసం, ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థమని ఆమె అన్నారు.
ప్రస్తుత వ్యవస్థ సరిగా పనిచేయడం లేదనే భావనతోనే వాంగ్‌చుక్ ఈ పోరాటం చేస్తున్నారని సోనాక్షి అభిప్రాయపడ్డారు. ఆమె ప్రకటనతో వాంగ్‌చుక్‌కు మద్దతు తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖుల జాబితాలో మరో పేరు చేరింది. ఆయన లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం, ప్రజలు మరింత దృష్టి సారించాలని ఆమె పరోక్షంగా సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!