

రాజమౌళి - మహేశ్ బాబు కలిసి చేస్తున్న భారీ చిత్రానికి “వారణాసి” అనే టైటిల్‌ను అనుసంధానించడంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ టైటిల్‌ను దర్శకుడు సుబ్బారెడ్డి రెండు సంవత్సరాల క్రితమే TFPCలో రిజిస్టర్ చేసుకున్నారని సమాచారం. SSMB29 టీమ్ ఈ టైటిల్‌ను వాడుకోవాలనుకుని ఆయనను సంప్రదించగా, అది తన సినిమా కోసం ఉంచుకున్నానని చెప్పి ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య అనుకోని టైటిల్ క్లాష్ నెలకొంది.
ఇటీవల సుబ్బారెడ్డి TFPC కార్యాలయానికి వెళ్లి అధికారికంగా కూడా ఈ టైటిల్‌ను తానే వాడతానని స్పష్టం చేశారట. మరో వైపు, రాజమౌళి టీమ్‌కు దగ్గరగా ఉన్నవారు మాత్రం ఈ టైటిల్ ఇప్పటికే మరో యూనిట్ పేరుతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నమోదైందని చెబుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి భిన్నమైన సమాచారం రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.
టైటిల్‌పై ఈ వివాదం పెరుగుతుండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీలోని పలువురు ఈ విషయం ఎటు తిరుగుతుందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుందా? లేక మరింత పెద్ద స్థాయిలో వివాదంగా మారి, రాజమౌళి - మహేష్ బాబు సినిమా టైటిల్ ను ప్రభావితం చేస్తుందా? అన్నది ఇప్పుడు చూడాల్సి ఉంది. TFPC మరియు ఫిల్మ్ ఛాంబర్ అధికారిక నిర్ణయమే దీనిపై స్పష్టత ఇస్తుంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!