

నాగచైతన్య కెరీర్లో మైలురాయిగా నిలిచిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘తండేల్’ విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఫిబ్రవరి 7 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు, చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 2018 లో శ్రీకాకుళం మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన యదార్థ ఘటన ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మత్స్యకారుడి పాత్ర కోసం నాగచైతన్య తన లుక్, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుని పాత్రలో ఒదిగిపోయారు. ‘సత్య’ పాత్రలో సాయి పల్లవి ఎమోషనల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన అనంతరం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయి అక్కడ కూడా రికార్డు వ్యూస్ సాధించింది. శాటిలైట్ ప్రీమియర్లలో అత్యధిక టీఆర్పీ నమోదు చేసిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, శ్రీకాకుళం తీర ప్రాంతాల్లోని సహజ లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫిబ్రవరి 7 ను అభిమానులు సోషల్ మీడియాలో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!