

యంగ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “భగవంతుడు”. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏషియన్ ఫిలిమ్స్ నారాయణదాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రవి పనస నిర్మిస్తున్నారు. జి.జి. విహారి దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ రాజకీయ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా టీజర్ విడుదలై మంచి స్పందన పొందింది.
టీజర్ లాంచ్ కార్యక్రమంలో పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో కొత్త మేకోవర్లు, బలమైన పాత్రలు, ప్రత్యేకమైన కథనం ఉంటాయని నటులు క్రిష్, జబర్దస్త్ అభి, రవీందర్ విజయ్, మైమ్ మధు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కె.పి. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయని చెప్పారు. దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఈ సినిమా దర్శకుడు గోపి విహారి, హీరో తిరువీర్ కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు జి.జి. విహారి మాట్లాడుతూ ఈ సినిమా సమాజంలోని విరుద్ధతలు, మూగవారికి గొంతుగా నిలిచే అంశాలతో రూపొందిందన్నారు. పల్నాడు నేపథ్యంగా రూపొందిన ఈ కథకు చారిత్రక బలం ఉందని చెప్పారు. నిర్మాత రవి పనస ఈ సినిమా అసురన్, కాంతార, కర్ణన్, జైభీమ్ లాంటి శక్తివంతమైన చిత్రాలను గుర్తు చేస్తుందని తెలిపారు. హీరో తిరువీర్ కథ విన్న వెంటనే అంగీకరించానని, ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. సందీప్ కిషన్, విశ్వక్ సేన్ టీజర్‌ను ప్రశంసిస్తూ ప్రేక్షకులు ఈ సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏప్రిల్‌లో “భగవంతుడు” సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!