

అరుదైన కథతో తెరకెక్కిన చిత్రం ‘సరస్వతి’. ఈ చిత్రానికి నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. తన సోదరి పూజా శరత్‌కుమార్ తో కలిసి దోసా డైరీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాను ఈటీవీ విన్ సంస్థ సమర్పిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో ప్రధాన అతిథులుగా రాధికా శరత్‌కుమార్, శరత్‌కుమార్, సిమ్రన్ పాల్గొన్నారు. రాధిక మాట్లాడుతూ, “ఇలాంటి అరుదైన కథతో ‘సరస్వతి’ రూపొందడం చాలా గర్వంగా ఉంది. మౌనంగా ఉన్న అనేక అమ్మాయిలకు ధైర్యం ఇచ్చే సినిమా ఇది”, అని అన్నారు. అలాగే, “వరలక్ష్మి నటనలోకి రావడం మొదట శరత్‌కుమార్ అంగీకరించలేదు. కానీ తరువాత ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు”, అని చెప్పారు. వరలక్ష్మి మాట్లాడుతూ, “మన కుటుంబాన్ని మనం ఎంచుకోలేం, కానీ కుటుంబం మనను ఎంచుకుంటుంది. నా అమ్మ, రాధిక ఆంటీ నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారు. నా భర్త నిక్ సహకారంతో ఈ సినిమా ప్రారంభమైంది. బలమైన సందేశంతో పాటు వినోదం కూడా కలిగిన సినిమా ఇది”, అన్నారు.
నిర్మాత స్వప్నదత్ మాట్లాడుతూ, “‘సరస్వతి’ ఒక అర్థవంతమైన కథతో రూపొందిన మంచి సినిమా అవుతుంది”, అని అన్నారు. నటి సిమ్రన్ కూడా “వరలక్ష్మి ధైర్యానికి ప్రతీక. ట్రైలర్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది”, అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రియమణి, నందినిరెడ్డి, సప్తగిరి, నితిన్ చక్రవర్తి మరియు వరలక్ష్మి భర్త నికోలాయ్ సచ్‌దేవ్ పాల్గొన్నారు.






.avif&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!