

సాధారణంగా చాలా మంది దర్శకులు తమ సినిమా కథను చివరి వరకు దాచిపెట్టాలని చూస్తారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు. కొందరు మాత్రం ప్రమోషన్ల ద్వారా కథకు సంబంధించిన చిన్న ఐడియా ఇస్తారు. ఐతే కథ గురించి ముందే ఒక ఐడియా ఇచ్చేస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏం ఉంటుందనే ప్రశ్న తలెత్తుతుంది.
కానీ యువ హీరో ఆది సాయికుమార్ కు అలాంటి భయం లేదని చెబుతున్నాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శంబాల సినిమా కథను ఆయన ఓపెన్‌గా వెల్లడించాడు. ఇందులో హీరో ఒక యువ శాస్త్రవేత్త. అతడు ప్రతీ విషయాన్ని శాస్త్రీయ దృష్టితో చూస్తాడు. ఒక పల్లెటూరిలో ఆస్టరాయిడ్ పడిందని తెలిసి, అది శాస్త్రానికి సంబంధించిన విషయం అని భావించి అక్కడికి వెళ్లి పరిశోధన చేయాలనుకుంటాడు. అయితే ఆ ఊరి ప్రజలు భక్తి, మూఢ నమ్మకాల పై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు. ఆస్టరాయిడ్ పడటాన్ని దుష్ట శక్తుల ప్రభావంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరి వారితో పోరాడుతూ, నిజాన్ని ఎలా బయటపెడతాడనే అంశమే ఈ సినిమా కథ.
మూఢనమ్మకాలున్న గ్రామంలో శాస్త్రీయ ఆలోచనలున్న హీరో వెళ్లడం అనే కథాంశం గతంలో కార్తికేయ వంటి సినిమాల్లో కనిపించింది. అయినా కూడా శంబాలలో కొత్తదనం, ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయని ఆది చెబుతున్నాడు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే చాలా బలంగా ఉంటుందని, కొత్త సన్నివేశాలు, ఎప్పటికప్పుడు ఉత్కంఠ కలిగించే మలుపులతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని తెలిపారు. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25 న విడుదల కానుంది.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!