

గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చే సమస్య కాదని, ఇది ఏళ్ల తరబడి శరీరంలో నిశ్శబ్దంగా పెరిగే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఫలితమని వైద్యులు చెబుతున్నారు. చాలామంది కొలెస్ట్రాల్ తగ్గించుకోవడంపైనే దృష్టి పెట్టినా, అసలు కారణమైన గట్ హెల్త్‌ను విస్మరిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఒత్తిడి, కాలుష్యం వల్ల జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతిని శరీరంలో వాపు పెరుగుతుంది. ఈ వాపు రక్తనాళాలకు చేరి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
నిద్రలేమి, ఒత్తిడి, శారీరక కదలికల లోపం వంటి అలవాట్లు గట్ హెల్త్‌ను దెబ్బతీసి గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి సహజ ఆహారం, ఫైబర్, ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం, సరైన నిద్ర, వ్యాయామం వంటి జీవనశైలి మార్పులు చేయడం అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటే గుండె కూడా సురక్షితంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!