

ప్రతి చలికాలంలో దగ్గు రావడం సాధారణ సీజనల్ సమస్యగా భావించడం సరైనది కాకపోవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లని, పొడి గాలి, వైరల్ ఇన్ఫెక్షన్లు, కాలుష్యం, ఇండోర్ అలెర్జీలు వంటి కారణాల వల్ల శీతాకాలంలో దగ్గు రావడం సాధారణమే. అయితే ప్రతి సంవత్సరం దగ్గు ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని శరీరం ఇస్తున్న హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉబ్బసం, దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ప్రారంభ దశ COPD వంటి వాయుమార్గ వ్యాధులు మొదట్లో నిరంతర దగ్గు, శ్వాసలోపం వంటి లక్షణాలతో కనిపించవచ్చని వైద్యులు చెబుతున్నారు. చలి గాలి సున్నితమైన వాయుమార్గాలకు ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలు, ఇమేజింగ్, అలెర్జీ పరీక్షల ద్వారా ముందుగానే నిర్ధారణ చేస్తే చికిత్స సులభమవుతుంది. సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలను నియంత్రించవచ్చు.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏ ఆరోగ్య సమస్యలకైనా తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!