

ప్రశాంత్ వర్మపై ప్రొడ్యూసర్లతో ఉన్న ఆర్థిక వివాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ఆయన చేయబోయే ప్రభాస్ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు పెద్ద అనిశ్చితి నెలకొంది. ప్రభాస్ ఇప్పటికే హోంబలే ఫిలింస్ (సలార్ బ్యానర్)తో మూడు సినిమాల డీల్ సైన్ చేశాడు. ఆ బ్యానర్ ఆయనకు డైరెక్టర్లను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందట. ఆ ఒప్పందంలో భాగంగా మొదట ప్రభాస్ ప్రశాంత్ నీల్‌తో సలార్ 2 చేయబోతున్నాడు.
మిగిలిన రెండు సినిమాల్లో ఒకటి ప్రశాంత్ వర్మతో, ఇంకొకదానికి మరో దర్శకుడితో పని చేసే ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు, ప్రశాంత్ వర్మ ఒకప్పుడు రణవీర్ సింగ్‌కి చెప్పిన అదే కథను ప్రభాస్‌కి కూడా నేరేట్ చేశాడట. ఆ కథ విన్న ప్రభాస్ పాజిటివ్‌గా స్పందించాడని టాక్. కానీ ఇప్పుడు ఆయనపై వస్తున్న ఆర్థిక వివాదాల కారణంగా ప్రభాస్ కొంచెం వెనక్కి తగ్గుతున్నాడట. తన ఇమేజ్‌కి ఎలాంటి వివాదాలు రాకూడదని భావిస్తూ, ఇతర డైరెక్టర్లతో పనిచేసే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రశాంత్ వర్మ మాత్రం ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి, "నా మీద వచ్చిన ఆరోపణలు ఒకపక్క కథ మాత్రమే, మీడియాలో వచ్చిన వార్తలు తప్పుగా అర్థం చేసుకున్నాయి" అని చెప్పాడు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (2)
If they team up, it’s gonna be fire
Prabhas seems careful now