

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ దర్శకులలో అనిల్ రావిపూడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా ప్రేక్షకులను నవ్విస్తూ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. గత సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి విజయం అందుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి, నయనతార దంపతులుగా నటిస్తున్నారు. వీళ్ళ ఫ్యామిలీలో అనుకోకుండా చిన్న వివాదాలు రావడం వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని అనుకోవడంతో వెంకటేష్ వచ్చి వీళ్ళిద్దరిని ఎలా కలిపాడు అనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు కామెడీతో నడుస్తుందని, అందుకే ప్రేక్షకులు ఈ కథతో సులభంగా కనెక్ట్ అవుతారని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేష్ కలిసి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేసే కామెడీ సీన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని సమాచారం. ఆ సీన్లో వింటేజ్ చిరంజీవి, వింటేజ్ వెంకటేష్ కనిపిస్తారని, వీరిద్దరి మధ్య చిన్నపాటి ఫైట్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై మరోసారి అనిల్ రావిపూడికి విజయాన్ని అందిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!