

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’పై మరో ఆసక్తికర ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ రూపొందిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ సీక్వెల్‌కు ఈ ప్రచారం మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
గతంలో ఈ చిత్రానికి సంబంధించి షారుఖ్ ఖాన్ పేరు వినిపించినప్పటికీ, ప్రస్తుతం హృతిక్ రోషన్ పేరు ప్రధానంగా చర్చకు వస్తోంది. చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. హృతిక్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను త్వరలో చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్, ఎస్.జే. సూర్య, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. రజనీకాంత్, హృతిక్ రోషన్ ఒకే తెరపై కనిపిస్తే అది అభిమానులకు ప్రత్యేక సినీ విందుగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!