

టాలీవుడ్లో రామ్ చరణ్ తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ (RC17)కు హీరోయిన్ ఎంపికపై భారీ బజ్ నడుస్తోంది. రంగస్థలం తర్వాత సుకుమార్‌తో మళ్లీ కలిసి చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి, స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది, ప్రీ - ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. రంగస్థలంలో సమంత క్యారెక్టర్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే, అదే తరహాలో ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కూడా కీలకంగా ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, కన్నడ యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్‌ను ఈ పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం.

సప్త సాగరాలు దాటి, కాంతార చాప్టర్ 1 సినిమాలతో దక్షిణాదిలో భారీ క్రేజ్ సంపాదించిన రుక్మిణి వసంత్ ప్రస్తుతం యష్ 'టాక్సిక్', ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీగా ఉంది. సుకుమార్ స్క్రిప్ట్‌కు ఆమె క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని టాక్. పెద్ది సినిమా పూర్తయిన తర్వాత 2026 సమ్మర్లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రుక్మిణి ఎంపిక ఖరారైతే ఆమె కెరీర్ మరో స్థాయికి చేరుతుంది, తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకున్న ఫాలోయింగ్‌తో మెగా ఫ్యాన్స్ కూడా సూపర్ ఖుషీ అవుతారు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!