
సినిమాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, తర్వాత చేయాల్సిన ప్రాజెక్ట్‌లపై కొత్త ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
మొదట నెల్సన్ దిలీప్ కుమార్‌తో భారీ పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పటికీ, ఆయన ‘జైలర్ 2’ మరియు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడే అవకాశం ఉందని టాక్. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!