

తెలుగు, తమిళ భాషలతోపాటు నార్తిండియాలో కూడా ఫాలోవర్లున్న కోలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరు విజయ్ సేతుపతి. తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరు సంజయ్ దత్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. అవును ఇప్పుడు ఈ క్రేజీ వార్తే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అజిత్ కుమార్‌తో విదాముయార్చి మూవీని తెరకెక్కించిన తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడట. మక్కళ్ సెల్వన్ లీడ్ రోల్లో నటించనున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా నటించబోతున్నాడట. ఈ చిత్రంలో బీటౌన్ భామ శ్రద్ధాకపూర్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారన్న న్యూస్ ఒకటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆదిత్యబిర్లా గ్రూప్ నిర్మించనుందని సమాచారం. విజయ్ సేతుపతి, సంజయ్ దత్ సెఫరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లని తెలిసిందే. మరి ఇద్దరు సిల్వర్ స్క్రీన్‌పై కలిసి నటిస్తే అభిమానులు, మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ క్రేజీ కాంబోపై ఏదైనా అధికారిక వస్తుందేమో చూడాలి మరి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!