

‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై సృష్టించిన మ్యాజిక్ ఇంకా మరిచిపోలేదు. ఇప్పుడు అదే కాంబినేషన్‌ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రయత్నిస్తున్నాడనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ‘జైలర్ 2’లో బిజీగా ఉన్న నెల్సన్, త్వరలో తారక్–చెర్రీ కాంబోలో ఓ మాస్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. ఇద్దరు హీరోలు కథ విన్న తర్వాత పాజిటివ్‌గా స్పందించారనే సమాచారం వినిపిస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్-తారక్ జోడీ తెరపై సృష్టించిన విజువల్ వండర్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచింది. “నాటు నాటు” పాటతో ఆస్కార్ గెలుచుకోవడం ఆ మ్యాజిక్కు ముద్ర వేసింది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్లీ వస్తుందనే వార్త అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. ఇటీవల రజనీకాంత్‌తో ‘జైలర్’ ద్వారా సెన్సేషన్ సృష్టించిన నెల్సన్, ప్రస్తుతం దాని సీక్వెల్ పనుల్లో ఉన్నాడు. అదే సమయంలో తారక్, చెర్రీ కాంబోతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఏదేమైనా తారక్, చెర్రీ మళ్లీ ఒకే సినిమాలో కనిపించనున్నారనే ఊహ అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే, సౌత్ ఇండియన్ సినిమా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సంచలనాన్ని సృష్టించడం ఖాయం.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (3)
Tarak–Cherry combo again means festival in theaters!
“ఆర్ఆర్ఆర్” తరహా మ్యాజిక్ మరోసారి చూడబోతున్నాం అనిపిస్తోంది!
Naatu naatu vibes again