
గాసిప్స్

అందాల తార తమన్నా భాటియా మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఆమె, త్వరలో రూపొందనున్న ‘రాగిణి 3’ చిత్రంలో నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన తమన్నా జంటగా కనిపించనున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలిసింది. దీనికి శశాంక్ ఘోష్ దర్శకత్వం వహించనుండగా, ఏక్తా కపూర్ నిర్మించనున్నారు. తమన్నా, జునైద్‌ల తాజా జంట ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముందని సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!