
రాజకీయాలు

భారత్‌తో సంబంధాలు, చర్చల అంశంపై పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమైన అంశాలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్ కూడా నష్టాలను ఎదుర్కొందని, ఆ సమస్యతో తమ దేశం సైతం ఇబ్బందులు పడిందని పేర్కొన్నారు.
ఉగ్రవాదంపై భారత్ సాక్ష్యాలు అందిస్తే, తాము కూడా ఆధారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మాలిక్ అన్నారు. ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చలు జరగాలని పాకిస్థాన్ కోరుకుంటోందని చెప్పారు. అయితే చర్చలు ప్రారంభించాలంటే భారత్ ముందుగా పాకిస్థాన్‌ను ఆహ్వానించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!