

‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా దర్శకుడు బోయపాటి శ్రీను డిమాండ్ మాత్రం తగ్గలేదని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరు, ముగ్గురు ప్రముఖ నిర్మాతలు బోయపాటి కోసం పోటీ పడుతూ తమ బ్యానర్లో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హీరో డేట్లు, ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ తర్వాత విషయమన్నా, నిర్మాతలు మాత్రం ముందుగానే సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకునే కొంతమంది కొత్తవాళ్లు కూడా బోయపాటి దర్శకత్వంలోనే సినిమా చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కీర్తి రెడ్డి ఇప్పటికే బోయపాటిని కలిసినట్లు వార్తలు ఉన్నాయి. అయితే బోయపాటి తదుపరి ప్రాజెక్ట్‌పై స్పష్టత ఇంకా రాలేదు. హిందీలో కూడా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారని, అందుకు కథ సిద్ధంగా ఉందని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది.
‘అఖండ 2’కు సరైన సమయం దక్కలేదని, ఇతర కారణాల వల్ల సినిమా ప్రభావితమైందని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. అదే కారణంగా బోయపాటి ప్రతిభపై విశ్వాసం ఉంచి ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని సమాచారం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!