

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పెద్ది (Peddi)పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ డ్రామా జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. విడుదలైన గ్లింప్స్‌లో రామ్ చరణ్ రస్టిక్ లుక్, విజువల్స్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇటీవల ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట కాజల్ అగర్వాల్, శ్రీలీల, పూజా హెగ్డే పేర్లు వినిపించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్లు వర్కౌట్ కాలేదని సమాచారం. తాజా టాక్ ప్రకారం, ‘సీతా రామం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్ ఈ ఐటెం సాంగ్‌లో కనిపించనున్నారనే ప్రచారం బలంగా సాగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పాటు, రామ్ చరణ్ సినిమా కావడంతో మృణాల్ వెంటనే ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఐటెం సాంగ్‌ను భారీ సెట్స్‌తో, గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ పాటకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే ఎనర్జిటిక్ ట్యూన్ రెడీ చేశారనే వార్త హైప్‌ను మరింత పెంచుతోంది. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. అన్ని షెడ్యూల్ ప్రకారం జరిగితే, పెద్ది సినిమా మార్చి 27 న థియేటర్లలో విడుదల కానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!