

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణం ఆశించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో, తన తదుపరి ప్రాజెక్టులపై కూడా నాని దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని లైన్‌లో పెట్టిన ఆయన, మరో దర్శకుడితో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథ నానికి బాగా నచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫైనల్ నరేషన్ అనంతరం ఈ ప్రాజెక్ట్‌కు ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, సుజీత్ ‘ఓజీ 2’ పనుల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!