

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘వారణాసి’ ఒకటి. మహేశ్‌బాబు – ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుందన్న ప్రచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వారణాసిలో తాజాగా దర్శనమిచ్చిన భారీ హోర్డింగులే ఈ ప్రచారానికి కారణమయ్యాయి. ఎలాంటి వివరాలు లేకుండా కేవలం విడుదల తేదీ మాత్రమే కనిపించడంతో అవి ‘వారణాసి’ సినిమాకి సంబంధించినవేనని సమాచారం.
తెలుగునాట ఉగాది, ఉత్తర భారతంలో గుడి పడ్వా పండుగల్ని పురస్కరించుకుని ఆ రోజున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పురాణాలు, కాల ప్రయాణం నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబుకు జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి సమకూరుస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!