

సినిమా పరిశ్రమలో తారల మధ్య రిలేషన్షిప్ వార్త పుట్టడం సహాజంగానే జరుగుతుంటాయి. తాజాగా అలాంటి రూమర్లే ఇప్పుడు పెళ్లి వార్తల వరకు వెళ్లాయి. ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్, తమిళ స్టార్ హీరో ధనుష్ మధ్య కొంతకాలంగా రిలేషన్షిప్ ఉందని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ధనుష్ హాజరైన ఓ బాలీవుడ్ పార్టీలో మృణాల్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంలో ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనం ప్రకారం, మృణాల్–ధనుష్ ఫిబ్రవరి 14 న చాలా గోప్యంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్యే ఈ వివాహం జరగాలని, మీడియాకు దూరంగా తమ ప్రైవసీ కాపాడుకోవాలని ప్లాన్ చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ పెళ్లి గురించి గానీ, అఫైర్ గురించి గానీ మృణాల్ ఎక్కడా ధృవీకరించలేదు. అందుకే ఈ వార్తలో నిజమెంత, రూమర్ ఎంత అన్నది స్పష్టత లేకుండా ఉంది.
గత కొద్దికాలంగా మృణాల్ తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్నారు. బాలీవుడ్లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తుండటం గమనార్హం. అయితే ఇటీవల ఇలాంటి డేటింగ్ వార్తలు మృణాల్ చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆమె ఓ క్రికెటర్‌తో చనువుగా ఉంటున్నారనే వార్తలు కూడా ఇటీవల మీడియాలో కనిపించాయి. ఇలాంటి వార్తలతో మృణాల్ నిత్యం మీడియాలో ఏదో ఓక రకంగా ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ధనుష్ విషయానికి వస్తే.. తన భార్యతో విడాకుల తర్వాత తాను సింగిల్‌గానే ఉంటున్నారు. దాంతో ఈ వార్తకు ఆయన పేరు జోడించడంతో ఎక్కువగా ప్రాధాన్యం సంతరించుకొన్నది. కెరీర్ పరంగా చూస్తే.. 2025 సంవత్సరంలో కుబేరా లాంటి హిట్‌ను ఖాతాలో వేసుకొన్నారు. ఆ తర్వాత ఇడ్లీ కడై, బాలీవుడ్ చిత్రం తెరే ఇష్క్ మే సినిమాలో నటించారు. ప్రస్తుతం కారా అనే చిత్ర షూటింగుతో బిజీగా ఉన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!