

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'పెద్ది'.. మరో నెల రోజుల్లో థియేటర్లలోకి రానుంది. షూటింగ్ ఇంకా కొనసాగుతుండటంతో సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓవర్సీస్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని చిత్ర బృందం ప్రకటించడంతో సినిమా విడుదలలో మార్పు లేదని పరోక్షంగా స్పష్టమైంది.
ఇక ఈ సినిమాలో ఉండే స్పెషల్ ఐటమ్ సాంగ్ గురించి కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ పాట కోసం ముందుగా పూజా హెగ్డే, ఆయేషా ఖాన్ మరియు మృణాల్ ఠాకుర్ పేర్లు వినిపించాయి. అయితే పాట షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో చివరికి ఎవరిని తీసుకుంటారో స్పష్టత రాలేదు. తాజాగా ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
మృణాల్ ఠాకూర్ త్వరలో విడుదల కానున్న తన సినిమా 'డకాయిట్' ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు రానున్నారు. అదే సమయంలో ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ షూటింగ్లో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ పాటలో జాన్వీ కపూర్ కూడా కొద్దిసేపు కనిపించే అవకాశం ఉందని సమాచారం. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో శివరాజ్ కుమార్, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందన పొందాయి.



.jpg&w=3840&q=75)








.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!