

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో పూర్తి ఫామ్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా ఆయన నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే 158 వ సినిమా (Mega 158) టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు దర్శకుడు బాబీ కొల్లి కావడం, గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కావడం అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాను రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నారని సమాచారం.
Mega 158 ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ మెగాస్టార్‌ను కొత్త షేడ్‌లో చూపిస్తుందనే టాక్ ఉంది. కథలో బలమైన భావోద్వేగాలు, పవర్ఫుల్ మాస్ సీన్స్ ఉండేలా బాబీ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. మొదట కార్తీ పేరు వినిపించగా, ప్రస్తుతం మోహన్ లాల్ ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అనురాగ్ కశ్యప్ కూడా ఈ సినిమాలో భాగం అవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
టెక్నికల్ టీమ్ కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మాలీవుడ్ టాప్ డీఓపీ నిమిష్ రవి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. అలాగే, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ఏమిటంటే, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారన్న వార్తలు. ఆమె హీరోయిన్గా నటిస్తారా లేదా అతిథి పాత్రలోనా అనేది ఇంకా సస్పెన్స్. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మొత్తంగా Mega 158 చిరంజీవి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే సినిమా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!