

‘బలగం’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి, ఇప్పుడు తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మొదట నాని, నితిన్ పేర్లు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (డీఎస్పీ) హీరోగా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ వచ్చినా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సినిమాను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ ఓ ప్రత్యేక గ్లింప్స్ వీడియోను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. డీఎస్పీ హీరోగా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశముంది.
హీరోయిన్ విషయంలో కూడా చర్చ కొనసాగుతోంది. మొదట పరిశీలనలో ఉన్న సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు ఇప్పుడు లేవని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో, డీఎస్పీ నటుడిగా ఎలా మెప్పిస్తాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. అధికారిక ప్రకటనతో పాటు తదుపరి అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!