

పాత తెలుగు పాటలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు అనే విషయం మరోసారి రుజువైంది. ఈ తరం ప్రేక్షకులు కూడా మిడ్ 80 ల కాలం నాటి పాటలను ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో కొత్త పాటలు భారీ ఖర్చుతో వచ్చినా కొద్ది కాలంలోనే మరిచిపోతున్నారు. కానీ నలభై, యాభై ఏళ్ల క్రితం వచ్చిన పాటలు ఇప్పటికీ అదే క్రేజ్‌తో వినిపిస్తున్నాయి.
ఇటీవల కే ర్యాంప్ సినిమాలో హీరో రాజశేఖర్ నటించిన పాత సినిమా పాటను ఉపయోగించారు. మొదట ఆ పాటను తక్కువ ఖర్చుతో రైట్స్ దొరికాయని తీసుకున్నా, అది సినిమాకు పెద్ద హైలైట్‌గా మారింది. అలాగే మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కోసం మూడు భాషల్లో ఒకే ట్యూన్ ఉన్న పాట అవసరమైంది. అప్పట్లో ఇళయరాజా ఒకే ట్యూన్‌ను పలు భాషల్లో ఇచ్చేవారు కాబట్టి, ఆయన స్వరపరిచిన ‘సుందరీ.. నేనే నువ్వంట’ పాటను ఎంపిక చేశారు. అవసరమైన చోట్ల మరికొన్ని పాత పాటల బిట్స్ కూడా వాడారు.
ఈ పాటలన్నింటిని ఉపయోగించడానికి ఆడియో కంపెనీలకు భారీగా చెల్లించాల్సి వచ్చిందని సమాచారం. కేవలం చిన్న చిన్న బిట్స్ కోసం మొత్తం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. అయితే ఆ పాత పాటల బిట్స్ సినిమాకు మంచి ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ‘రామ్మా చిలకమ్మా’ పాటకు వెంకీ డ్యాన్స్ చేస్తే ప్రేక్షకులు ఈలలు వేస్తూ హుషారుగా స్పందించారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!