

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ నటించిన సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ అనౌన్స్ చేసిన సంగతి ఇప్పటికే తెలిసింది. 2025లోనే ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించాలని ప్లాన్ చేసినప్పటికీ, పలు కారణాల వల్ల షూట్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఈ సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయన డేట్స్ కుదరక ప్రాజెక్ట్ ప్రారంభం వరుసగా వెనక్కి వెళ్లింది. ఇక చివరికి అన్ని అడ్డంకులు తొలగి, ఈ భారీ సినిమా పట్టాలెక్కేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, రిషబ్ శెట్టీ వచ్చే ఏడాది జనవరి నుండి ఐదు నుంచి ఆరు నెలల వరకు ప్రశాంత్ వర్మకు కాల్షీట్స్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ‘జై హనుమాన్’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఫైనల్గా ఒక మంచి వార్తగా చెప్పాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!